Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

5 అడుగుల ఎత్తు.. 30 అడుగుల వెడల్పుతో బన్ని సైకత శిల్పం

  • రేపు స్టైలిష్ స్టార్ పుట్టిన రోజు
  • విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో బన్ని సైకత శిల్పం 
  • ఫొటోలు తీసుకుంటోన్న అభిమానులు
రేపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విశాఖపట్నం బన్ని అభిమానులు ఆర్కే బీచ్‌లో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. సైకత శిల్పి మానస్‌ శేషు ఈ శిల్పాన్ని తీర్చిదిద్ది హ్యాపీ బర్త్‌ డే అల్లు అర్జున్‌ అని రాశారు. విడుదలకు సిద్ధమైన బన్ని సినిమా 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' పేరును కూడా రాశారు. ఈ సైకత శిల్పం  5 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు ఉంది. ఆర్కే బీచ్‌కు వచ్చిన వారంతా బన్ని సైకత శిల్పంతో ఫొటోలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌కి ఆయన అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా బన్ని నటించి నా పేరు సూర్య సినిమా వచ్చేనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.                   
Allu Arjun
Vizag
fans

More Telugu News